ఇది కరెక్ట్ కాదు.. కోహ్లీపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు !

Saturday, January 20th, 2018, 06:39:10 PM IST

గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీ సేన 2018 కొత్త ఏడాదిలో మాత్రం ఉహించని విధంగా ఆరంభంలోనే అపజయాన్ని మూటగట్టుకుంది. సౌత్ ఆఫ్రికా లో మూడు టెస్టుల సిరీస్ లలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఓటమిపాలైంది. ఆటగాళ్లు పోరాడుతూనే ఓటమి చెందడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ ఓటమి వల్ల కోహ్లీపై చాలా వరకు విమర్శలు వెలువడుతున్నాయి. కొందరు ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు కూడా టీమ్ సెలెక్షన్ పై మండిపడుతుండడం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొందరు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా భారత సీనియర్ ఆటగాడు హర్భజన్ వివిమర్శలపై తనదైన శైలిలో స్పందించాడు. జయాపజయాలు ఆటలో సహజం అంత మాత్రానా జట్టును సభ్యులను నిందించడం మంచిది కాదు. ముఖ్యంగా కెప్టెన్ పై విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదని చెబుతూ.. ప్రస్తుతం భరత జట్టు చాలా బలంగా ఉందని మనం అండగా ఉండే మళ్లీ విజయం సాధిస్తారని చెప్పాడు. అంతే కాకుండా ఆటగాళ్లు కూడా నిరాశచెందకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని నెక్స్ట్ మ్యాచ్ లో మంచి ప్రదర్శనతో రానించేందుకు కృషి చేయాలనీ హర్భజన్ తెలిపాడు.