ఆ ట్వీట్ నేను చేయలేదు.. హార్దిక్ వివరణ!

Friday, March 23rd, 2018, 12:03:44 PM IST

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య పేరు మీద గతంలో వచ్చిన ఒక ట్వీట్ కారణంగా ప్రస్తుతం అతను న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రిజర్వేషన్స్ వ్యాధిని వ్యాప్తి చేశాడని హార్దిక్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ నుంచి ట్వీట్ రావడంతో ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరచింది. వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలనీ ఎస్సీ/ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో హార్దిక్ ఈ విషయంపై స్పందించాడు.

అంబేద్కర్ ని అవమానిస్తూ నేను ఎలాంటి ట్వీట్ చేయలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదని నేను ఆ ట్వీట్ చేయలేదు అని పాండ్య చెబుతున్నాడు. అంతే కాకుండా తన పేరు మీద ఉన్న ఫెక్ ఎకౌంట్ నుంచి ఆ ట్వీట్ వచ్చిందని చెబుతూ.. నేను కేవలం నా అధికార ట్విట్టర్ ని మాత్రమే ఉపయోగిస్తాను అని తెలిపాడు. అదే విధంగా భారత రాజ్యంగా సృష్టి కర్త అంబెద్కర్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఏ వర్గాన్ని కించపరిచే ఆలోచన తనకు లేదని తెలిపాడు. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం కేసులో అన్ని విధాలుగా సహకరించే విధంగా నడుచుకుంటానని చెబుతూ.. కేవలం తన పరువు ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకే అలా చేసి ఉంటారని పాండ్య వివరణ ఇచ్చాడు.