బీసీసీఐ అక్షింతలు: హార్దిక్ క్షమాపణలు..!

Wednesday, January 9th, 2019, 05:00:46 PM IST

బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ షో “కాఫీ విత్ కరణ్” లో తోలి సారిగా ఇద్దరు క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కే ఎల్ రాహుల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సహజంగానే ఈ షోకి వచ్చే అతిధులను హోస్ట్ కరణ్ బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఉదాహరణకు సైఫ్ అలీ ఖాన్, తన కూతురు సారా అలీ ఖాన్ తో కలిసి పాల్గొన్న సమయంలో కరణ్ తాను ఇంటర్వ్యూ చేస్తున్నది తండ్రి కూతుళ్లని అన్న సంగతి మర్చిపోయి కరీనా, సైఫ్ ల వైవాహిక జీవితానికి సంబందించిన ప్రశ్నలు అడిగాడు, అప్పట్లో సొషల్ మీడియాలో దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య, రాహుల్ ని కూడా మహిళలు, సెక్స్ కి సంబంధించి అలాంటి ప్రశ్నలే అడిగాడు కరణ్, షో సాంప్రదాయం ప్రకారం అదే రీతిలో స్పందించారు ఇద్దరు యువ క్రికెటర్లు.

కరణ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా హార్దిక్, తన తల్లిదండ్రులతో కలిసి పార్టీలో పాల్గొన్న విషయాన్ని, తన సెక్స్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు, అంతే కాకుండా మహిళలను అగౌరవంగా ఏకవచనంతో ఇది, అది అంటూ ఏకవచనంతో సంబోదించాడు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. హార్దిక్, రాహుల్ లు కరణ్ షో స్పందించిన తీరు మహళలను కించపరిచేలా ఉన్నాయంటూ, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ నోటీసులు, ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన హార్దిక్ తన వ్యాఖ్యలు ఎవరినైనా కించపరిచి ఉంటె క్షమించండి, కించపరిచే ఉద్దేశం ఆ వ్యాఖ్యలు చేయలేదని, షో సంప్రదాయం ప్రకారం స్పందించా అని చెప్పుకొచ్చాడు.