కాంగ్రెస్‌కు షాకిచ్చిన హ‌రీష్‌

Sunday, November 4th, 2018, 09:33:45 AM IST

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి గులాబీ బాస్ కేసీఆర్ గ‌జ్వేల్ నుంచి పోటీకి దిగుతున్న విష‌యం తెలిసిందే. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి పోటీప‌డుతున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఇక్క‌డి నుంచి మ‌ట్టిక‌రిపించాల‌న్న ప్యూహంతో హ‌రీష్‌రావుపై శ‌నివారం ఒంటేరు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు ప్రైవేట్ నంబ‌ర్ నుంచి ఫోన్ చేసిన హ‌రీష్‌రావు ఎలాగైనా త‌న మామ కేసీఆర్‌ను గ‌జ్వేల్‌లో ఓడించాల‌ని త‌న‌ను కోరిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

దీనిపై స్పందించిన హ‌రీష్‌రావు కాంగ్రెస్ కుటిల ప‌న్నాగానికి గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. నేను ఫోన్ చేసిన‌ట్టు చెప్ప‌డం కాదు. ద‌మ్ముంటే ఆ ఆధారాలేంటో చూపించి మాట్లాడు కానీ గాలి వార్త‌లు చెప్ప‌కు! అని ఒంటేరుకు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. అంతేనా ఒంటేరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వార్డు మెంబ‌రుగా కూడా గెల‌వ‌లేని నీవు కేసీఆర్‌కు పోటీనా? ప‌్ర‌త్య‌ర్థి అత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయాల‌న్న పన్నాగంలో భాగంగా ఇలాంటి నీతిమాలిన వ్యాఖ్యం చేస్తున్న ఒంటేరు నిజాయితీ ఏంటో గ‌జ్వేల్ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని, ఇక‌నైనా ఇలాంటి చౌవ‌క‌బారు విమ‌ర్శ‌లు కాకుండా ప‌స వున్న‌విమ‌ర్శ‌లు చేస్తే ఆస్వాధిస్తామ‌ని ఎద్దేవా చేశాడు హ‌రీష్‌రావు.

రాజ‌కీయాల్లో, అందునా ఎన్నిక‌ల వేళ గోబెల్స్ ప్ర‌చారం మంచిది కాద‌ని, అది మొద‌టికే మోసం అయ్యే అవ‌కాశం వుంద‌ని, ఇక నుంచైనా ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తే మంచిద‌ని హిత‌వుప‌లికారు. ఒంటేరుకు ప్ర‌తాప‌రెడ్డి ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్టే ర‌కం. కేసీఆర్‌పై గెలుపు అసాధ్యం అని తెలిసే నాపై అర్థం ప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. న‌న్ను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు దిగ‌డం కాంగ్రెస్ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. త‌న పుట్టుక‌, చావు టీఆర్ ఎస్‌లోనే అని మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం విశేషం. మ‌రి దీనిపై కాంగ్రెస్ వ‌ర్గాలు ఎలాంటి కౌంట‌రిస్తాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments