విజయసాయి ట్వీట్ కు హరిబాబు ఘాటు రిప్లై..!

Tuesday, February 12th, 2019, 08:31:26 AM IST


ఢిల్లీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన టీడీపీ నేతలు వెళ్లారు, వారితోపాటుగా బీజేపీ ఎంపీ హరిబాబు కూడా ఢిల్లీ వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుమ్మెత్తి పోశారు. టీడీపీ-బీజేపీలు బయటకి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లోలోపల మాత్రం ప్రేమాయణం సాగిస్తున్నాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ హరిబాబు, టీడీపీ నేతలు కలిసున్న ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ, బీజేపీల అనైతిక బంధానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీతో కటీఫ్ అంటూ, చంద్రబాబు అండ్ కో ఆ పార్టీతో చాటుమాటు కాపురం చేస్తోందంటూ సెటైర్లు వేశారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ కు స్పందనగా హరిబాబు. విమానంలో ఏ పార్టీవారైనా ప్రయాణించవచ్చని అన్నారు. విశాఖ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వచ్చానన్న ఆయన సహ ప్రయాణికులు ఎవరన్న విషయం తనకు అనవసరమన్నారు. విమానంలో ఏ పార్టీకి చెందినవారైనా ప్రయాణించవచ్చని, ఈ విషయంలో ఎటువంటి నిషేధం లేదని, అసత్యాలతో దుష్ప్రచారం చేసేవారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ తాను ప్రయాణించిన ఫ్లైట్ టికెట్లను పోస్ట్ చేస్తూ విజయసాయిరెడ్డికి ఘాటైన రిప్లై ఇచ్చారు.