హరికృష్ణ పెద్దకర్మ.. ఎన్టీఆర్ తో ముచ్చటించిన చంద్రబాబు!

Saturday, September 8th, 2018, 04:48:55 PM IST

సినీ నటుడు, సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ నేత శ్రీ నందమూరి హరికృష్ణ గత నెల 29న
నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నేటికీ ఆయన మరణించి 10 రోజులు పూర్తవ్వడంతో దశదిన కర్మను నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ అలాగే ఇతర తెలుగు దేశం పార్టీ నేతలు హాజరయ్యారు.

హరికృష్ణ తనయులు నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉదయమే జలవిహార్ కు చేరుకొని తండ్రికి నివాళులర్పించారు. ఇక హరికృష్ణ సోదరి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, హీరో నాగార్జున, ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను అలాగే కళ్యాణ్ రామ్ లతో ప్రత్యేకంగా మాట్లాడి హరికృష్ణ చిత్ర పటానికి నివాళులర్పించారు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఫొటోల కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments