షాకింగ్ : తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర – హరీశ్ రావు..!

Thursday, December 6th, 2018, 10:43:03 AM IST

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న ఆయన, తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర జరుగుతోందని ప్రజలు దాన్ని తిప్పుకోట్టాలని అన్నారు. ఈ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా నేతలు తెలంగాణను వాల్ల చేతిలో కీలుబొమ్మగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పథకం ప్రకారమే చంద్రబాబు, లగడపాటి వంటి నేతలు నాటకాలు ఆడుతున్నారని, ప్రజలు మూడో విడత పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఆంధ్ర నుండి చంద్రబాబు మోట్ల కట్టలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామలో దొరికిన 5కోట్ల నోట్ల కట్టలు చంద్రబాబు, నామా నాగేశ్వరరావు కోసం పంపినవే అని ఆరోపించారు. లగడపాటి చంద్రబాబు ద్రోహి అని, చంద్రబాబు ఏజెంట్ అని అన్నారు. లోక్ సభలో మరో పది నిమిషాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది అనగా లగడపాటి పెప్పర్ స్ప్రే నాటకం ఆది అడ్డుకొనేందుకు యత్నించారని అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోతుందని లగడపాటి అనటం హాస్యాస్పదం అన్నారు.