హరీష్ రావు ఫోన్ పోయింది..స్వయంగా వెతికినా..!!

Friday, December 8th, 2017, 10:30:52 PM IST

మంత్రి హరీష్ రావు పబ్లిక్ అప్పియరెన్స్ ఈ మధ్య కాస్త తగ్గింది. గతంలో ఆయన మీడియా ముందు కనిపించినంతగా ఇప్పుడు కనిపించడం లేదు. కానీ తన నీటి పారుదల శాఖ సంబంధించిన పనులని మాత్రం లోలోపలే చక్కబెట్టేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పరిశీలించిన సందర్భమగా కన్నె పల్లి పంప్ హౌస్ వద్ద జరిగిన ఘటనతో వార్తల్లోకి వచ్చారు.

కన్నె పల్లి పంప్ హౌస్ వద్ద హరీష్ రావు తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ విషయం మంత్రిగారికి ఆ ప్రదేశం వదలి వెళ్లకాకాని అర్థం కాలేదు. కొంత దూరం ప్రయాణించాక ఆయన మొబైల్ ఫోన్ చూసుకున్నారు. కానీ కనిపించకపోవడంతో కన్నె పల్లికి తిరిగి వెనక్కు వచ్చారు. స్వయంగా మంత్రితో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఆప్రదేశం మొత్తం గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేది లేక ఆయన నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి హరీష్ రావు కాళేశ్వరం పోజెక్టు ని సందర్శించారు.

  •  
  •  
  •  
  •  

Comments