హరీష్ రావు ద్విపాత్రాభినయం బాగుంది : కేటీఆర్

Sunday, June 10th, 2018, 07:22:29 PM IST

తెలంగాణ లో ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పెట్టె యోచనలో వున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రెండుమూడురోజులుగా ఈ విషయమై అటు ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులూ పలువిధాలుగా చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఆర్టీసీ వారు సమ్మె చేపట్టిన నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సమ్మె చేపడితే అన్నివిధాలా ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకే నష్టమని, అందువల్ల ప్రభుత్వం తరపున తమ విన్నపాన్ని స్వీకరించమని ఆయన కోరిన విషయం తెలిసిందే. అయితే రెండు వర్గాల మధ్య చర్చల్లో భాగంగా నేడు అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక నేతల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇందాక ఎమ్యెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన ఐటి మంత్రి కేటీఆర్, ఆర్టీసీ సంఘాల నాయకులు తమ నిబంధనలకు ఒప్పుకుందనుకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడడం అబినందించదగ్గ విషయం అని ఆయన కొనియాడారు. అంతే కాక మరీ ముఖ్యంగా టిఎంయు కు గౌరవ అధ్యక్షులుగా వున్నా కల్వకుంట్ల హరీష్ రావు గారు అటు సంఘాల నేతలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య మంచి వారధిగా నిలిచి ఇరువర్గాలవారికి మధ్యవర్తిత్వం వహించి ద్విపాత్రాభినయం వహించారని, అందుకుగాను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే పలు విషయాలపై ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపామని, ఇక త్వరలో ఆ సంస్థలో ప్రవేశపెట్టబోయే నూతన సంస్కరణపట్ల ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments