ఎయిర్ హోస్టెస్ లకు లైంగిక వేధింపులు తప్పట్లేదు!

Tuesday, May 29th, 2018, 08:01:19 PM IST


ఇటీవల కాలంలో ఆడవారిపై రోజు రోజుకు లైంగిక వేధింపులు ఎక్కువైన విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడ అనే కాకుండా దాదాపుగా అన్ని శాఖల్లోనూ వారిపై వేధింపులు జరుగుతున్నట్లు బయటకు వస్తున్న వాస్తవాలను బట్టి చూస్తుంటే తేటతెల్లమవుతోంది. కాగా అసలు విషయంలోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ పై అదే శాఖకు చెందిన ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకరు గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని ఆ ఎయిర్ హోస్టెస్ ఇటీవల విమానయాన శాఖామంత్రి సురేష్ ప్రభుకు, అలానే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ విషయమై ఆ శాఖలోని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏకంగా ఆరేళ్ళ నుండి ఆయన ఒక మృగాడులా నాపై విరుచుకుపడుతున్నాడు. అంతే కాదు తనకు లొంగలేదని అసభ్య పదజాలంతో తిడుతూ, తోటి సహోద్యోగినుల ముందు నాతో నీచంగా ప్రవర్తిస్తూ నా పరువు తీస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే ఆమె రాసిన లేఖపై స్పందించిన మంత్రి సురేష్ ప్రభు, ఘటనపై విచారణ చేపట్టి అవసమైతే ఒక కమిటీ వేసి త్వరలో నిజ నిజాలు తేల్చాలని, ఒకవేళ నిజమని తేలితే ఆ ఆఫీసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా సంస్థను ఆదేశించారు. అయితే ఘటన విషయమై ఎయిర్ ఇండియా సంస్థకు గత సెప్టెంబర్ లో ఫిర్యాదు చేయగా చాన్నాళ్ల తర్వాత వారు ఫిర్యాదు చివరకు స్వీకరించి, ఆ ఆఫీసర్ కు సమన్లు ఎంతో ఆలస్యంగా అనగా మూడు, నాలుగు నెలల తర్వాత పంపారని వాపోయింది. నిజానికి తాను ఆయన కంటే కింది స్థాయి ఉద్యోగినిని కాబట్టే నా బాధను వాళ్ళు పట్టించుకోవడం లేదని, ఆయన సంస్థలోని ఇతర ఉద్యోగులను తనవైపు తిప్పుకుని చెప్పినట్లు ఆడిస్తున్నాడని ఆరోపిస్తోంది. కాగా ఎట్టకేలకు తన ఫిర్యాదు పై స్పందించిన మంత్రి సురేష్ ప్రభుకి ధన్యవాదాలు తెలుపుతూ, తనను ఇంత మానసిక క్షోభకు గురిచేసిన అతనికి కఠిన శిక్ష అమలుచేయాలని కోరింది…..

  •  
  •  
  •  
  •  

Comments