మీ..టూ ఉధ్య‌మం.. ప్ర‌ముఖ హీరోయిన్ షాకింగ్.. ఇక్క‌డ‌ ఎవ‌రు ఎవ‌రిని వాడుకున్నారు..?

Wednesday, October 24th, 2018, 04:14:30 PM IST

దేశ‌వ్యాప్తంగా మీ..టూ ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకీ లైంగిక వేధింపుల ఆరోప‌ణలు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. అయితే తాజాగా క‌న్న‌డ హీరోయ‌న్ హ‌ర్షిక పూనాచా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌హిళ‌ల‌కు ఎదుర‌వుతున్న లైంగిక వేధింపుల‌కు వ్యతిరేకంగా గా ఏర్ప‌డిన మీ..టూకు మ‌ద్ద‌తు తెల్పిన హ‌ర్షిక .. కొంద‌రు హీరోయిన్ల పై ఫైర్ అయ్యింది. కొంత‌మంది వాళ్ళ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం మీ..టూని వాడుకుంటున్నార‌ని ఆరోపించింది.

కెరీర్ మొద‌ట్లో అవ‌కాశాలు, డ‌బ్బు, ల‌గ్జ‌రీ లైఫ్ కోసం కొంద‌రు కాంప్ర‌మైజ్ అయ్యి.. ఇప్పుడు ప‌నిగ‌ట్టుకొని వారి పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డింది. ఇక ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న వారిలో చాలా మంది హీరోయిన్లు షూటింగుల కోసం విదేశాలు వెళ్ళిన‌ప్పుడు.. మ‌ధ్యం, డ్ర‌గ్స్ తీసుకుంటూ సినీ ప్ర‌ముఖుల‌తో, వ్యాపారుల‌తో, ప‌ర్శ‌న‌ల్‌గా గ‌డ‌ప‌డం చాలా సార్లు చూశాన‌ని.. నాడు త‌మ స్వార్ధం కోసం.. ప‌డ‌క‌గ‌దికి వెళ్ళి.. తీరా ప‌ని అయిపోయాక వారి పై లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని… ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌రిని వాడుకున్నారో ఆరోప‌ణ‌లు చేస్తున్న‌.. కొంద‌రు సాంప్ర‌దాయ మ‌హిళ‌లే చెప్పాల‌ని హ‌ర్ష‌క మండిప‌డింది. దీంతో ఇప్ప‌టికే మీ..టూ పై భిన్నాభిప్రాయాలు వ‌స్తున్న నేప‌ధ్యంలో హ‌ర్షిక వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.