తన భార్యతో మాట్లాడుతున్నాడని చితకబాదాడు!

Thursday, July 26th, 2018, 07:22:03 PM IST

నేటి సమాజంలోని మనిషిలో విపరీతమైన పైత్యాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. అందులో కొందరు మగవాళ్ళు, మరియు ఆడవాళ్లు ఇద్దరు కూడా తమ జీవిత భాగస్వాములపై లేనిపోని, అర్ధం లేని అనుమానాలతో రకరకాల ఘటనలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళితే, చండీగఢ్ లోని ఫతేహాబాద్ జిల్లాలో కరెంజీత్ తన భార్యతో సహా జీవిస్తున్నాడు. అయితే నేడు బైక్ పై తన స్నేహితుడితో కలిసి రోడ్ పై వెళ్తుండగా హఠాత్తుగా ఒకచోట అతని భార్య మందం సింగ్ అనే వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది. నువ్వు ఎవరు, అసలు నీకు నా భార్యతో పని ఏంటి, ఇద్దరు కలిసి ఇక్కడ ఏమి మాట్లాడుతున్నారు అంటూ మందం సింగ్ తో పెద్ద వివాదం పెట్టుకున్నాడు. ఆమె, నేను ఇద్దరం ఒకప్పుడు కలిసి చదువుకున్నామని, దారిలో కనిపిస్తే వూరికే మాట్లాడుతున్నానుఆ అని ఎంత చెప్పినా వినకుండా మందం సింగ్ పైకి దాడి చేసాడు. అయితే పక్కనే వున్న అతని భార్య వారిస్తున్నప్పటికీ కూడా బైక్ పై తనతో పాటు వచ్చిన ఫ్రెండ్ మరియు కరెంజీత్ ఇద్దరు కలిసి మందం సింగ్ పై పిడిగుద్దులు గుద్దారు. ఇక ఆ ఘటనలోకి ఆ చుట్టుప్రక్కలి వారు కూడా తోడవడంతో అందరూ కలిసి మందం సింగ్ ని చితకబాదారు.

కాగా ఆ దృశ్యాన్ని మిగిలిన వారు వీడియోలు తీస్తూ ఉండిపోయారుతప్ప ఎవరు కూడా జరిగిన దుర్ఘటనను వారించడానికి ముందుకురాకపోవడం శోచనీయం. కాగా అక్కడ గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీస్ లు విషయం తెలుసుకుని కరెంను మరియు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని మందం సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన కరెం భార్య, అతను తన మీద అనుమానంతో రోజు కొడుతుంటాడని, అందుకే ఇవ్వాళ మందం సింగ్ తో మాట్లాడుతున్నపుడు దాన్నీ కూడా తప్పుగా అర్ధం చేసుకుని, నేను చెప్పేది వినకుండా కరెంజీత్ పై కనికరం లేకుండా దాడి చేసారని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీస్ లు కరెం మరియు అతని స్నేహితుడి సహా, ఘటనలో మందం సింగ్ పై దాడికి పాల్పడిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన కరెంజీత్ పరిస్థితి పర్వాలేదని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పోలీస్ లు చెపుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments