ఉద్యోగం పేరుతో పిలిపించి ఏమిచేసాడంటే…..

Thursday, May 10th, 2018, 01:00:51 AM IST


ఇటీవల మహిళలపై అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొందరం మృగాళ్ళు అమాయకులైన, అభంశుభం తెలియని ఆడవారిని రకరకాల మోసాలతో నమ్మించి అత్యాచారాలకు పాల్పడుతున్న దృఘటనలు అక్కడక్కడా చూస్తున్నాం. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో 26ఏళ్ళ ఒకమహిళ తన బిడ్డతో సహా నివాసముంటుంది. అయితే ప్రాంతానికి చెందిన ఆర్ కే మెహతా అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆ మహిళకు ఫోన్ చేసిన మెహతా తనకు తెలిసిన వారి దగ్గర ఉద్యోగం ఉందని,

ఇంటర్వ్యూకు రావాలని ఒకచోటకు రమ్మని చెప్పాడు. కాగా అతని మాటలు నమ్మి బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్లిన మహిళకు మాయమాటలు చెప్పి, కూల్ డ్రింక్ ఇచ్చి తాగమన్నాడు. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిన అతడు, ఆమె స్పృహ కోల్పోగానే తన నలుగురు స్నేహితులతో సహా మహిళను ఆ బిడ్డను కారులో ఎక్కించుకుని, మధ్యలో జాతీయ రహదారిపై బిడ్డను పడవేసి, తన స్నేహితులతో కలిసి మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపాడు. చివరకు ఆ మహిళను రోడ్డు పక్కన ఉన్న ఒకచోట పడవేసి వాళ్ళు పరారయ్యారు.

కాగా అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు, ఆమెను బిడ్డతో సహా స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఒకరోజు తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ మెహతా మోసాన్ని పోలీసులకు వివరించింది. కాగా మహిళ ఇచ్చిన వివరాలను బట్టి మెహతాను, అతని స్నేహితులను వీలైనంత త్వరగా పట్టుకుని అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు ఎవరిని పడితే వారిని నమ్మకూడదని, మెహతా వంటి దుర్మార్గులు సమాజంలో చాలామంది ఉండాలని, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు…….