వైసీపీతో ఆయన కుమ్మక్కయ్యాడు : టీడీపీ నేత వరదరాజులు రెడ్డి

Sunday, June 10th, 2018, 09:53:10 AM IST

కడప జిల్లాలో టిడిపి నేతల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుతోంది. ప్రస్తుతం అక్కడి ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థానిక మాజీ ఎమ్యెల్యే వరదరాజులు రెడ్డి, ప్రముఖ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ప్రొద్దుటూరు పురపాలక పార్కులో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి అక్కడి కమీషనర్ స్థానిక పబ్లిక్ హెల్త్ శాఖకు లిఖితపూర్వకంగా దాని నిర్మాణానికి అనుమతులిస్తే రమేష్ మాత్రం వైసిపి నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డితో కలిసి కుమ్మక్కై దానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇప్పటికే పలురకాలుగా, జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో రమేష్ గ్రూపులను ఏర్పాటు చేసి టీడీపీని అన్నివిధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో అయన చేసిన కాంట్రాక్టుల తాలూకు బిల్లులు ఆగిపోతే వైసిపి అధినేత జగన్ సాయంతో తన బిల్లులను వసూలు చేయించుకున్న ఘన చరిత్ర రమేష్ ది అని ఎద్దేవా చేశారు.

ఏమి ఆశించి మీరు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు, వైసీపి పార్టీకీ ఎంతకి అమ్ముడుపోయారని ప్రశ్నించారు. ఇప్పటికే రమేష్ పోకడలకు ఇక్కడి టీడీపీ నేతల పరువు పూర్తిగా పోయిందని, వారు ఇకపై ప్రజల్లోకి ఎలా వెళ్తారని, అయినా నేరుగా ఎన్నికల్లో పోటీచేసి గెలవలేని రమేష్ వంటి అసమర్ధ నాయకుడికి వైసిపి రహస్యంగా గొడుగు పట్టడం హేయమైన చర్య అని అభివర్ణించారు. పార్టీ పెట్టిన పదవి బిక్ష, అలానే పార్టీనేతల అండదండలు, పార్టీ సొమ్ముతో జల్సాగా జీవనం సాగిస్తున్న అయన ఈ విధంగా తిన్న ఇంటి వాసులను లెక్కించడం సరికాదన్నారు. కావున ఆయన ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే విషయాన్నీ టిడిపి అధిష్టానానికి నివేదించి సీఎం రమేష్ పై కఠినచర్యలు తీసుకోవలసిందని కోరామన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments