ఈయన్ని చూస్తుంటే అచ్చం ఆయన్నే చూసినట్లుంది !

Wednesday, January 17th, 2018, 03:15:56 AM IST

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఆమె ఏమి మాట్లాడినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు ఉంటుంది, టిడిపి తమ పార్టీపై చేసే విమర్శలకి ధీటుగా ప్రతివిమర్శలు చేసే వై ఎస్ ఆర్ పార్టీ నగరి యం యల్ ఏ రోజా. వైఎస్సాఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులుగా అలుపెరగకుండా ఎన్నికష్ట నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన చిత్తూర్ లో పర్యటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన యాత్రకు కొంత విరామం ఇచ్చారు. ఆయన భార్య భారతి కూడా ఇక్కడికే వస్తుండడంతో ఆయన కుటుంబ సమేతంగా చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం పరాకాల్వ లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ సాంప్రదాయ దుస్తులయిన దోతీ, కండువా ధరించారు. యం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, యం పి విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి, సునీల్ కుమార్ రెడ్డి మరియు చిత్తూర్ వైఎస్సాఆర్సిపి నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తున్న జగన్ గారిని చూస్తుంటే సాక్ష్యాత్తు ఆయన తండ్రి దివంగత నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నట్లే ఉందని, తదుపరి ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మ్రోగించడం ఖాయమని ఆమె ఆసక్తికరంగా ఈ వ్యాఖలు చేశారు..