ఫోన్ ఛార్జింగ్ పెట్టి, పాటలు వింటూ చనిపోయాడు!

Thursday, May 3rd, 2018, 05:07:05 PM IST

నేటి కాలంలో మొబైల్ ఫోన్ అతి తక్కువ ధరలకు అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరు అవసరమున్నా, లేకున్నా మొబైల్ లు కొనేస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ వాడకంలో కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఫోన్ ఛార్జింగ్ పెట్టి పాటలు వుంటుంటే అది సడన్ గా పేలడం, అలానే ఛార్జింగ్ లో వున్న ఫోన్ బ్యాటరీ పేలి గాయాలపాలవడం వంటి కొన్ని ఘటనలు విన్నాము. అయితే నిన్న ఇటువంటి ఒక ఘటన సంగారెడ్డి లో చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే, రంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామంలో ఎమ్ఆర్ఎఫ్ లో పెర్మనెంట్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ కి కొన్నాళ్ల క్రితం పెళ్లి అయింది. అతనికి రెండేళ్లు, అలానే ఒక నెల నిండిన ఇద్దరు ప్లిల్లలున్నారు. నిన్న మే డే, అందునా సెలవు దినం కావడంతో అతడు ఇంటిదగ్గరే వున్నాడు. అంతే కాదు పడుకునే ముందు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి, దానికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి పాటలు వింటూ పడుకున్నాడు. అయితే తెల్లారి శ్రీనివాస్ ను లేపడానికి ప్రయత్నించిన భార్య, శ్రీనివాస్ ఎంతసేపటికి లెగవకపోవడంతో కంగారుపడి ఇరుగుపొరుగు వారిని పిలుచుకువచ్చింది.

అయితే శ్రీనివాస్ అప్పటికే చనిపోయాడని తెలుసుకున్న భార్య భోరున విలపించింది. ఈ ఘటన విషయమై పోలీస్ లకు ఆమె ఫిర్యాదు చేయగా, నిన్న రాత్రి ఆ వూళ్ళో కరెంటు సప్లై హెచ్చు తగ్గులు గా ఉండడంతో ఒక్కసారిగా ఫోన్ నుండి పాస్ అయిన హై వోల్టాజి కరెంటు, ఇయర్ ఫోన్స్ ద్వారా అతనికి షాక్ తగిలి మరణించి ఉంటాడని అనుకుంటున్నారు. కాగా అతని మృత దేహాన్ని సవా పరీక్షల నిమిత్తం స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు…….

  •  
  •  
  •  
  •  

Comments