హోంమంత్రిగారి చెప్పులకు కాపలా కాయడం చూసారా?

Thursday, May 17th, 2018, 03:35:25 PM IST

మనం ఎవరిమైనా గుడికివెళ్ళినపుడు మన మదిలో దేవుడిమీద ఎంతభక్తి ఉన్నప్పటికీ, లోలోపల మాత్రం మనం గుడిబయట విడిచిన చెప్పులపై కూడా మనసులో భయం ఉంటుంది. ఇది సామాన్యుడి దగ్గరినుండి ప్రముఖుల వరకు అందరికి ఒకేలా ఉంటుంది అని చెప్పకతప్పదు. ఇక విషయంలోకి వెళితే, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలోగల మహంకాళి అమ్మవారి గుడివద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ నిన్న ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారి గుడికి కుటుంబసమేతంగా విచ్చేసారు. అయితే ఆయన గుడిలోపలికి వెళ్లే ముందు బయట విడిచిన తన చెప్పుల జతను ఎవ్వరూ దొంగిలించకుండా ఆలయ సిబ్బంది ఒకరిని కాపలాపెట్టారు హోమ్ మంత్రి గారి అనుచరులు.

గుడిలోపలికి వెళ్లిన మంత్రిగారు దాదాపు గంటసేపు దైవదర్శనం, పూజల అనంతరం బయటకు వచ్చి తన చెప్పులువేసుకుని వెళ్లిపోయారు. ఈ నెల 11న స్థానిక కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చినపుడు బయటవిడిచిన ఆయన చెప్పులు మాయమవడంతో, పార్టీవారు ఆయనకు నూతన చెప్పుల జతను కొనిపెట్టారు. కాగా మరొక్కసారి అటువంటి ఘటన పునరావతుతం కాకుండా హోమ్ మంత్రి గారి చెప్పులకు ఇలా కాపలా పెట్టారన్నమాట. మంత్రిగారైనా, మామూలు వ్యక్తి అయినా చెప్పులు పోతాయేమో అనే భయం ఉంటుంది కందండి మరి……..

  •  
  •  
  •  
  •  

Comments