ఫ్లైట్ లో దోమలున్నాయని ఫిర్యాదు చేస్తే….అతన్ని ఏమి చేసారంటే ?

Tuesday, April 10th, 2018, 03:43:10 PM IST

ప్రస్తుతం విమానయాన సంస్థలు ప్రయాణీకులపై ప్రవర్తించే తీరును ఇటీవల జరిగిన పలు సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. కాగా ఇటీవల ఇండిగో విమాన సంస్థ ఒక ప్రయాణీకుడిని విమానం నుండి దింపేసి సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే, బెంగళూరు కు చెందిన సౌరవ్ భాయ్ అనే ప్రయాణికుడు లఖ్‌నో నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానాన్ని బుక్‌ చేసుకున్నారు. అయితే విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉండటంతో సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

అయితే దానిపై విమాన సిబ్బంది తన ఫిర్యాదును పట్టించుకోలేదు సరికదా తనపై చేయిచేసుకున్నారని సౌరభ్‌ ఆరోపించారు. అంతేగాక తనను విమానం నుంచి దింపేశారని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇండిగో కూడా వివరణ ఇచ్చింది. సదరు ప్రయాణికుడు హైజాక్‌ లాంటి పదాలు ఉపయోగించాడని, అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని విమానం నుంచి దింపేశామని పేర్కొంది. సౌరభ్‌ విమానంలోకి ఎక్కగానే దోమలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశాడు.

విమాన సిబ్బంది స్పందించేలోపే ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక విమానం తలుపు మూసివేయగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విమానాన్ని ధ్వంసం చేద్దామంటూ మిగతా ప్రయాణికులను రెచ్చగొట్టాడు. హైజాక్‌ లాంటి పదాలను ఉపయోగించాడు. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆయనను విమానం నుంచి దింపేసాం అని ఇండిగో తెలిపింది. అయితే ఇండిగో సంస్థ వ్యవరహించిన తీరును పలువురు నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇదివరకు కూడా ఈ విధంగా ప్రయాణీకులపై దాడికి పాల్పడ్డ ఇండిగో సంస్థపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments