కరెంటు బిల్లు చూసి ఉరేసుకున్నాడు!

Saturday, May 12th, 2018, 12:17:27 AM IST

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి రీత్యా కూరగాయలు అమ్ముకుని జీవించే 40 ఏళ్ళ జగన్నాథ్ షెల్కె గత 20 ఏళ్లుగా తన భార్య బిడ్డలతో కలిసి ఔరంగాబాద్ భరత్ నగర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు గదుల షెడ్డులో జీవిస్తున్నాడు. అయితే వున్నట్లుండి ఒకరోజు అతని ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసి అతడికి గుండె ఆగినంత పని అయింది. అందులో వారు గత నెలలో 55,519 యూనిట్ల కరెంట్ వినియోగించారని, అందుకు గాను రూ. 8,64,781 చెల్లించాలని బిల్ వచ్చింది. అది చూసిన అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంత బిల్లు తాను కట్టలేనని, తన కుటుంబ పోషణే కష్టతరమవుతుంది.

అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరేసుని చనిపోయాడు. స్థానిక సెక్షన్ ఇంజనీర్ కారణంగానే ఈతప్పు జరిగిందని, ఎమ్ఎస్ఈడిసిఎల్ అధికారులు తెలిపారు. మీటరు రీడింగ్ ని 6,117.8 కేడబ్ల్యూహెచ్‌గా కొట్టబోయి 61,178 కేడబ్ల్యూహెచ్‌గా కొట్టాడని, ఫలితంగా అంత బిల్లు జనరేట్ అయిందని విద్యుత్ అధికారులు చెపుతున్నారు. అయితే ఈ సంఘటనలో తప్పు చేసిన బిల్లింగ్ అధికారిని సస్పెండ్ చేశామని వారు అన్నారు. కాగా పోలీస్ లు కేసు నమోదు చేసి జగన్నాథ్ మృతిని ప్రమధువశాత్తు జరిగిన మృతిగా స్వీకరించి విచారణ చేపట్టారు. పెద్ద దిక్కు అయిన జగన్నాథ్ చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డునపడ్డామని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు…….

Comments