అతడే ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మ్యాన్ : స్పిన్నర్ రషీద్ ఖాన్

Sunday, June 10th, 2018, 04:07:37 PM IST

ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తన అద్భుత స్పిన్ మాయాజాలంతో మరోసారి మంచి పేరు సంపాదించినా ఆఫ్గనిస్తాన్ డాషింగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు రోజుల క్రితం ఐసీసీ టీ 20 ప్రపంచ ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో అతడు మరొకసారి మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. కాగా ఇటీవల బాంగ్లాదేశ్ తో జరిగిన టీ 20 సిరీస్ లో దుమ్ము రేపిన రషీద్, ఆ సిరీస్ విజయంలో కీలకపాత్ర వహించి మాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా నిలిచినా విషయం అందరికి తెలిసిందే. కాగా ఈనెల 14వ తేదినుండి బెంగళూరులో భరత్ తో ఆఫ్గనిస్తాన్ కు జరిగే ఒకే ఒక్క టెస్ట్ లో పాల్గొనే సందర్భంగా ఇక్కడి స్థానిక మీడియాతో మాట్లాడిన రషీద్ తనకు సచిన్ కు బౌలింగ్ చేయాలనే ఆశ తీరకుండానే మిగిలిపోయిందని,

సచిన్ వంటి ఆటగాడు మళ్ళి క్రికెట్ చరిత్రలో వస్తాడని అనుకోవడంలేదని స్పష్టం చేశాడు. భారత్ లో ప్రస్తుతం వున్న ఆటగాళ్లలో చాలామంది మంచి నేర్పు, నైపుణ్యం, ప్రావిణ్యం గల ఆటగాళ్లే ఎక్కువమంది వున్నారని అన్నారు. అంతేకాక తనకు భారత విద్వాంష్కార బ్యాట్స్ మాన్ విరాట్ కోహ్లీ అంటే తనకు చాల ఇష్టమని, అతని బాటింగ్ శైలి, షాట్స్ కు కొట్టే తీరు అద్భుతమని కొనియాడాడు. అంతేకాక తనకు కోహ్లీ కి బౌలింగ్ చేయడమంటే చాలా ఇష్టమని, ఎన్ని విధాలుగా బౌలర్లు ప్రయత్నించినప్పటికీ కోహ్లీ తన అద్భుత బాటింగ్ నైపుణ్యంతో బంతిని చీల్చి చెండాడుతాడని అన్నాడు……

  •  
  •  
  •  
  •  

Comments