హీరో మహేష్ బాబుకు లెటర్ రాసి….స్టూడెంట్ సూసైడ్!

Friday, April 27th, 2018, 11:20:35 AM IST

ప్రస్తుతం మనదేశంలో రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలిసితెలియని వయసులో యువతీ యువకులు లేనిపోని చిన్న చిన్న కారణాలతో నిండు నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాగా నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక విద్యార్ధి ఆత్మహత్య వింటే హృదయం చెలించక మానదు. వివరాల్లోకి వెళితే, గుంటూరు సిద్దార్థ నగర్ కు చెందిన పులి శ్రీనివాస రెడ్డి వృత్తి రీత్యా బెంగళూరు ఆంధ్రాబ్యాంక్ లో ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు, అందులో చిన్న కుమారుడు సునంద్ కుమార్ రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలి లోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ డ్యూయల్ కోర్సు 4వ సంవత్సరం చదువుతున్నాడు.

ఎప్పుడూ చదువులో ముందుండి, స్నేహితులు అందరితో కలిసిమెలిసి వుండే సునంద్ కుమార్ రెడ్డి అకస్మాత్తుగా నిన్న రాత్రి ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు చెపుతున్న వివరాల ప్రకారం అతడు గత మూడు రోజులుగా ఎందుకో ముభావంగా ఉంటున్నాడని, సరిగా భోజనం కూడా చేయడం లేదని అంటున్నారు. అయితే నిన్న రాత్రి భోజనం చేసాక రూమ్ కి వెళ్లి తలుపు వేసుకున్న సునంద్, తెల్లారి స్నేహితులు ఎంత తలుపు కొట్టిన తీయలేదని, అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి చెపితే, వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూదగానే, సునంద్ బెడ్ షీట్ తో ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనబడ్డాడని చెపుతున్నారు. వెంటనే స్థానిక గచ్చి బౌలి పోలీస్ లకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి బాడీని స్వాధీనం చేసుకుని హాస్పిటల్ కి పంపారని చెప్పారు. సునంద్ హీరో మహేష్ బాబుకు పెద్ద అభిమాని అని, తన రూమ్ నిండా మహేష్ బాబు ఫోటోలు ఉండేవని వారు చెపుతున్నారు.

అయితే సునంద్ ఆత్మహత్య చేసుకున్నది ఒత్తిడి వల్ల కాదని, ఏదో మరొక కారణం వుండి ఉంటుందని, అతని గదిలో రెండు లేఖలు దొరికాయని స్థానిక ఎస్ఐ చింతకాయల వెంకటేష్ చెపుతున్నారు. అయితే అందులో ఒక లేఖలో తమ బంధువులు అందరూ బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నారని, కేవలం అవసరాలకి అందరిని వాడుకుంటున్నారని, భారతీయ బంధుత్వ వ్యవస్థ పూర్తిగా మారాలని అతను లేఖలో పేర్కొన్నాడు. అంతే కాక మరొక లేఖలో తన అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అని, ఆయన తనకు మంచి ఇన్స్పిరేషన్ అని పేర్కొన్నాడు. నేను డిప్రెషన్ లో వున్నపుడు మీ సినిమాలే చూస్తాను, మీరే నాకు డాక్టర్ అని లేఖలో పేర్కొన్నాడు. కాగా సునంద్ మృతి విషయం తల్లి తండ్రులకి తెలియచేయగా వారు భోరున విలపించినట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments