టిడిపి ఎంపీ కి గుండెపోటు….షాక్ లో టీడీపీ నేతలు!

Saturday, May 5th, 2018, 02:05:28 AM IST

ఇటీవల మంచి పేరున్నఆళ్లగడ్డ నేత భూమా నాగిరెడ్డి, అలానే సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మొన్న నెల్లూరు జిల్లా నేత ఆనం వివేకా వంటి ప్రముఖులను కోల్పోయిన పార్టీకి నేడు మరొక రూపంలో సమస్య ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలమనిషిగా పేరున్న ఏలూరు ఎంపీ మాగంటి బాబు నేడు గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. ఎప్పుడు ఎంతో హుషారుగా, చలాకీగా తిరిగే బాబు నేడు చింతలపూడిలో టీడీపీ తలపెట్టిన సైకిల్ యాత్రలో ఆనందంగా పాల్గొన్నారు.

కాగా యాత్ర ముంగించుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆయన్ని వెంటనే సమీప ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా, పలు రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారని సమాచారం. ఎపుడు ఆనందంగా కార్యకర్తలతో హుషారుగా మాట్లాడే ఆయన ఒక్కసారిగా ఇలా కుప్పకూలడం టీడీపీ క్యాడర్ ని షాక్ లో పడేసింది. కాగా ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆయన ఆరోగ్య స్థితి పై ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు డాక్టర్లు చెపుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments