విషాదం : ప్రముఖ నటుడి మృతి

Sunday, April 15th, 2018, 09:51:11 PM IST


ప్రముఖ నటుడు, ప్రముఖ కారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ, తండ్రి రాఘవయ్య (86) మృతి చెందారు. రాఘవయ్య మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్య పార్దీవ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింనగర్ మహా ప్రస్తానంలో జరపనున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలు గ వున్న సమయంలో టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు పొందిన రాఘవయ్య వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల చిత్రాల్లో నటించారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా రాఘవయ్య ఓ పాత్రలో నటించారు. ఇదే ఆయన నటించిన ఆఖరి సినిమా…..