తెలంగాణా టిక్కెట్ల పంచివేతలో “భగ భగ” : వారి వల్లే మాకు టికెట్ రాలేదు..

Monday, September 10th, 2018, 12:25:27 PM IST

తెలంగాణా లో ముందస్తు ఎన్నికల నిమిత్తం అసెంబ్లీని రద్దు చేసి ముఖ్య మంత్రి కెసిఆర్ వారి పార్టీ నుంచి పోటీ చేస్తున్న దాదాపు 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన విషయం మీద తెలంగాణా రాష్ట్రం లో వారి యొక్క పార్టీ నేతల్లోనే తీవ్ర దుమారం కి మరియు వారి అసహనానికి నిరసనకు ప్రతీక అయ్యింది, మా నాయకుడికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకి టికెట్ ఎలా కట్టబెడతారు అంటూ వారి అనుచరులు ఆందోళనలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో పార్టీ కి పని చేస్తున్న సరే వారికి కూడా టికెట్ ఇవ్వకపోవడం తో వారిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇది అంతా కావాలనే కనిపించని రాజకీయేతర శక్తులు ద్వారా వారి పార్టీ కి సంబందించిన కొంత మంది ముఖ్య నేతల అండ దండలతోనే ఈ టిక్కెట్ల పంచివేత జరిగింది అని ఆ పార్టీ కి చెందిన టిక్కెట్టు రాని నేతలు బలంగా అంటున్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం ఎల్లా వేళలా పని చేస్తూ ఉన్న వారికి కూడా టిక్కెట్టు ఇవ్వకపోవడం తో ఈ అనుమానాలు ఇంకా బలంగా వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా వారు కాస్త మనస్తాపానికి గురి అయ్యారని తెలుస్తున్నది. ఇది అంతా ఒకవేళ తెరాస మళ్ళీ అధికారం లోకి వచ్చినట్టయితే ఈ అభ్యర్థులకు ఖచ్చితంగా మంత్రి పదవులకు పోటీ వస్తారని ముందే గ్రహించి వారికన్నా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు టిక్కెట్టు కట్టబెట్టినట్టు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా టిక్కెట్టు వచ్చిన వారికి మరియు తమకి అన్యాయం జరిగింది అన్న వాళ్లకి మాత్రం అసలు పడటం లేదు వారి వారి అనుచరులు మధ్య తీవ్ర దుమారమే తెచ్చిపెట్టేలా ఉంది అక్కడి వ్యవహారం.రంగారెడ్డి జిల్లాకి చెందిన శేర్ లింగమ్ పల్లి కి చెందిన తెరాస మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వానికి నిరసనగా జగదీశ్వర్ గౌడ్ యొక్క అనుచరులు ఆందోళన చేపడుతూ తమ నాయుడుకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకి టికెట్ ఇస్తారని మండిపడుతున్నారు.కరీంనగర్ జిల్లా కి చెందిన మానుకొండ టికెట్ ను గంటి ఆనంద్ కు ఇవ్వకుండా రసమయి బాలకిషన్ కి ఎలా ఇస్తారని వారి అనుచరులు సెల్ టవర్ ఎక్కి వారి నిరసన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో ర్రాష్ట్రం లో పలు చోట్ల ఆందోళనలు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, తెలంగాణా అసెంబ్లీ సీట్ల పంపకాలలో మాత్రం ఏదో తెలీని ఆంతర్యం ఉన్నది అని సుస్పష్టంగా తెలుస్తున్నది. అది ఎంత వరకు నిజమో? తెలియాలి..

  •  
  •  
  •  
  •  

Comments