వైసీపీ vs వంగవీటి ఇంకా తగ్గని జ్వాలలు..!

Wednesday, September 19th, 2018, 03:11:00 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్షము పేరు వంగవీటి అభిమానులు వద్ద చెప్తే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.వారు చేస్తున్న అన్యాయానికి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు వంగవీటి రాధ గారికి కాదని మల్లాది విష్ణుకి ఇవ్వడడంతో అక్కడి వంగవీటి అభిమానుల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు జగన్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.వైసీపీ పార్టీ యొక్క వారి సభ్యత్వ పత్రాలను తగులబెట్టి వారి యొక్క నిరసనను తెలియజేసారు.ఐతే కొంత మంది వంగవీటి అభిమానులు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు.

వైసీపీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వంగవీటి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు తీస్కున్న మరో నిర్ణయం పట్ల రాధ అభిమానులు ఇంకా మండిపడుతున్నారు.విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఇవ్వకపోగా ఏకంగా నియోజకవర్గాన్నే మార్చి వేరే దగ్గర పోటీ చేయమనడంతో వంగవీటి అభిమానులు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు.వియజయవాడ సెంట్రల్ టిక్కెట్టు ఇస్తానని ఇప్పుడు ఏకంగా నియోగకవర్గాన్నే మార్చి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చెయ్యమనడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఐతే ఇందుకు గల కారణం ఆ మధ్య వై ఎస్ జగన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీఐతం పైనా..మరియు కాపు రేజర్వేషన్లలో తాను ఏమి చెయ్యలేను అని చెప్పడంతో తీవ్ర దుమారం చెలరేగింది దీనితో అప్రమత్తమైన జగన్ పవన్ కి కాపు యువతలో ఉన్న ఓటు బ్యాంకును కాకున్నా మిగతా వోట్లను ఐనా తన వైపు తిప్పుకున్నా తన ఓటు బ్యాంకుకు నష్టమే అని అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల బ్రాహ్మణ సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత చూపుతున్నారని వారు కూడా ఈ మధ్య వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని గమనించిన జగన్ కాపు వర్గం నుంచి కోల్పోయిన ఓట్ల లోటును బ్రాహ్మణుల ఓట్లతో భర్తీ చేసుకోవచ్చని, విజయవాడలో బ్రాహ్మణ సంఘాలు ఎక్కువని వారిని దృష్టిలో పెట్టుకొనే వారి దృష్టిని ఆకర్షించాడనికి బ్రాహ్మణుడు అయినటువంటి మల్లాది విష్ణుకి అక్కడి సెంట్రల్ టిక్కెట్టుని కేటాయించినట్టు తెలుస్తుంది..ఐతే ఈ విషయం పై సీటు మార్చే పరిస్థితి ఐతే కనిపించట్లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.ఈ సందర్భంలో వంగవీటి అభిమానులకి ఈ మాత్రం వ్యతిరేక సూచనలు కనిపించినా వారు జనసేన పార్టీలోకి మారిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అంటున్నారు.