తిరుమలలో జనసునామి

Tuesday, September 30th, 2014, 08:50:47 PM IST


ఒకవైపు దసరా సెలవలు.. మరోవైపు శ్రీవారి బ్రహ్మొత్సవాలు… దీంతో తిరుమల కిక్కిరిసి పోయింది.. ఇసుకేస్తే రాలనంత జనం…దర్శనానికి దారెటో తెలియక భక్తులు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. నడకదారిలో భక్తులు పోటెత్తడంతో అలిపిరివడ్డ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగటంతో భక్తులకు గాయాలయ్యాయి.

బ్రహ్మొత్సవాలు అదేసమయంలో దసరా సెలవలు ఒకేసారి రావడంతో తిరుమల జనసంద్రంగా మారింది. ఒకేసారి, ఇంతటి జనం తిరుమలకు పోటెత్తడంతో.. టీటీడి చేతులెత్తేసింది. దర్శనం ఎప్పుడవుతుందో తెలియక.. భక్తులు నానాఅవస్థలు పడుతున్నారు.