కాంగ్రెస్ టికెట్లకు యమ డిమాండ్ !

Tuesday, February 12th, 2019, 12:28:47 PM IST

ఇంకొద్ది రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి కాకుండా ఈసారి కొంచెం త్వరగానే పనులు షురూ చేసింది. అభ్యర్థుల ఎంపికలో సీనియర్లు తలమునకలై ఉన్నారు. ముందుగా అన్ని స్థానాలకు ధరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా భారీ స్థాయిలో ఆశావహులు ధరఖాస్తులను అందజేశారు.

ఆదివారం రోజున 45 మంది ధరఖాస్తు చెసుకోగా సోమవారం అనూహ్య రీతిలో 110 మంది వరకు ధరఖాస్తులు సమర్పించారు. ఇక ఈరోజు మంగళవారం కూడా గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. పోటీని ఊహించినా ఈ స్థాయిలో ఉంటుందని పెద్దలు అనుకోలేదట. ధరఖాస్తులు చేసుకున్నవారిలో కొమటిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య, పొంగులేటి సుధాకర్ రెడ్డి, అంజన కుమార్ యాదవ్, రమ్యారావు తదితరులు ఉన్నారు. బలమైన అభ్యర్థులే రెసులో ఉండటంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేతలు.