ట్రాఫిక్ కొరడా

Sunday, September 14th, 2014, 12:17:34 PM IST


ఇకపై ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అవ్వాలంటే.. జేబుకు చిల్లులు పడ్డట్టే..సిగ్నల్స్ జంప్ అయితే, ఇప్పటివరకు ఏ వందో మహా అయితే 150 రూపాయలో పెనాల్టీ కడితే సరిపోయేది. కాని, ఇకపై అలాంటి ఆటలు సాగవు. ప్రభుత్వం రోడ్ ట్రాన్స్ ఫోర్ట్ అండ్ సేఫ్టీ బిల్ ను రూపొందించింది. దీని ప్రకారం.. ఇకపై సిగ్నల్స్ జంప్ అయితే నాలుగు నుంచి ఐదు వేలు పెనల్టీగా కట్టవలసి వస్తుంది. పదేపదే సిగ్నల్స్ జంప్ కు పాల్పడే వారైతే పదివేలు కట్టాల్సిందే. ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు అవరోధం కల్గించే వాహానాలపై కూడా కొరడా ఝుళిపించింది. తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని.. లేకుంటే కనుక ప్రభుత్వం రూపొందించిన బిల్ ప్రకారం ఫైన్ కట్టక తప్పదని హెచ్చరిస్తుంది.