వరుణుడు తొంగి చుస్తే చాలు.. దిగులు పడుతున్న కేటీఆర్..!

Wednesday, September 21st, 2016, 01:18:04 PM IST

ktr-rain
హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడానికి.. రోడ్లు నదులలా మారడానికి భారీ వర్షం అవసరం లేదు..వరుణుడు జస్ట్ అలా హైదరాబాద్ వంక తొంగి చుస్తే చాలు.ప్రస్తుతం హైదరాబాద్ లో డ్రైనేజి వ్యవస్థ గురించి వ్యంగ్యంగా మాట్లాడాలంటే పై విధంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగర పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో వాహన దారులు నరకం చూస్తున్నారు.

రోడ్లన్నీ చిన్నపాటి సెలయేరులుగా మారిపోయాయి. ఇలాంటి మైనస్ లు హైదరాబాద్ ప్రపంచ సుందర నగరాలలో ఒకటి అని పిలిచే అర్హత లేకుండా చేస్తున్నాయి.ఈ విషయం లో అందరికంటే ఎక్కువ దిగులు చెందుతోంది కేటీఆరే. ఎందుకంటే ఆయనే మున్సిపల్ శాఖామంత్రి.గత కొన్ని రోజులుగా మీడియాకి హైదరాబాద్ డ్రైనేజి గురించి వివరణ ఇవ్వడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు అద్వానంగా మారుతున్న విషయం తాను అంగీకరిస్తామని అన్నారు. హైదరాబాద్ డ్రైనేజి వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాకపోతే ఆ పనిని దశలవారీగా చేస్తామని అన్నారు.