వామ్మో హైదరాబాద్లో రాళ్ళ వర్షం పడిందా..ఎక్కడా..?

Sunday, April 1st, 2018, 11:38:50 PM IST


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో పాటు పలు చోట్ల వడగళ్ల వాన పడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కుమ్మరిగూడలో పిడుగుపాటు రెండు పాడి ఆవులు మృతిచెందాయి. సిద్దిపేట జిల్లా నంగనూరులో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లో వర్షంతో పాటు పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్, చందుర్తి మండలాల్లో.. నల్లగొండ జిల్లాలోని డిండిలో.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, కొత్తపేట, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, ఏఎస్‌రావునగర్, నాగారం, చర్లపల్లి, ముషీరాబాద్, అశోక్‌నగర్, లాలాపేట్, చిలకలగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, పార్శిగుట్ట, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, కార్ఖానా, ప్యాట్నీ, బేగంపేట, తార్నాక, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, జనగామ, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్‌లో వర్షం కురుస్తోంది.