టీడీపీ కి భారీ షాక్ – పార్టీ మారే యోచనలో ముగ్గురు ఎంపీలు

Friday, June 7th, 2019, 02:30:41 AM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ పార్టీ గెలుచుకుంది కేవలం 3 ఎంపీ స్థానాలు మాత్రమే… అంతేకాకుండా చాలా దారుణమైన ఓటమిని కూడగట్టుకుంది టీడీపీ. అయితే ఈ దెబ్బతో ఏపీలో టీడీపీ ఉంటుందా లేక ఊడుతుందా అనే అనుమానాలు నేతలందరిలో కూడా కలిగాయి… కాగా ఈ విషయంలో జోక్యం చేసుకున్న చంద్రబాబు నేతలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరు కూడా అధైర్య పడొద్దని, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని చంద్రబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాగా ఇదిలా ఉండగానే టీడీపీ నుండి వలసలు ఎక్కువవుతున్నాయనే వార్త సంచలనం సృష్టిస్తుంది. ఇది నిజమనే రుజువు చేస్తున్నారు టీడీపీ నేతలు… తాజాగా టిడిపి తరపున విజయవాడ ఎంపిగా గెలిచిన కేశినేని నాని బిజెపి నేతలతో బాగా టచ్‌లో ఉన్నారు. అంతేకాదు బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసుకున్నారు.

కాగా చంద్రబాబు ఆఫర్ చేసిన పదవిని కేశినేని నాని సున్నితంగా తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే… కాగా ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేసిన గళ్ళ జయదేవ్ చొరవతో నాని తో చంద్రబాబు భేటీ అయి పలు అంశాలపై చర్చలు సాగించారు. పార్టీ ఇచ్చిన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కేశినేని నానికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నాని మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారట. కాగా టిడిపిలో ఉన్న ముగ్గురు ఎంపిలను తమవైపు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బీజేపీ. ఏమవుతుందో చూడాలి ఇక…