ఫస్టాఫ్ రిపోర్ట్ : హలో గురు ప్రేమకోసమే

Wednesday, October 17th, 2018, 11:50:20 PM IST

గత కొంత కాలంగా సరైన హిట్ లేనటువంటి హీరో రామ్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “హలో గురు ప్రేమకోసమే”.ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో భారత కాలమానం ప్రకారం 4:30 కు మొదలయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఫస్టాఫ్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.ఈ చిత్రం త్రినాధరావు నక్కిన ఇది వరకు తీసిన నేను లోకల్,సినిమా చూపిస్తా మావ తరహాలోనే మొదటి నుంచి ఆధ్యంతం హాస్య సన్నివేశాలతో నడిచిందట.

హీరో రామ్ మరియు ప్రణీతల మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు కూడా బాగా మెప్పించాయట.దర్శకుని యొక్క ముందు చిత్రాల్లాగే ఈ చిత్రం కూడా రొటీన్ ట్రాక్ తీసుకున్నా సరే దాన్ని కొత్తగా చిత్రీకరించడంతో ఫస్టాఫ్ వరకు బాగానే వచ్చింది అని తెలుస్తుంది,అనుపమ తండ్రి ప్రకాష్ రాజ్ మరియు రామ్ ల మధ్య కొన్ని ఆసక్తికర ట్విస్ట్ తో ఇంటర్వెల్ కు చేరుకుంది.ఈ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుందో లేదో చూడాలి.పూర్తి రివ్యూ కోసం నేటి ఏపీ.కామ్ ను చూస్తూ వుండండి