25వేల అడుగుల ఎత్తు! వామ్మో హీరోగారి జంప్ చూశారా!!

Sunday, June 3rd, 2018, 05:17:08 PM IST

అత‌డి వ‌య‌సు 55. ఆ వ‌య‌సులో పెద‌నాన్న‌లే తాత‌య్యల్లా క‌నిపిస్తున్నారు. అలాంటిది అత‌డు ఇంకా యాక్ష‌న్ ఇర‌గ‌దీస్తున్నాడు. అంతేనా.. దాదాపు 25వేల అడుగుల ఎత్తు నుంచి భ‌యం అన్న‌దే లేకుండా దూకేసి షాకిచ్చాడు. అది కూడా ర‌న్నింగ్ విమానం లోంచి.. అంతెత్తు నుంచి జంప్ అంటే ఆషామాషీనా? దాదాపు 250 మైళ్ల వేగంతో.. 340 కి.మీల స్పీడ్‌తో భూమివైపు స‌ర్రున జెట్‌లా దూసుకొచ్చాడు.

ఇలాంటి ఫీట్ వేయ‌డానికి ఎవ‌రికైనా గుండెల నిండా ద‌మ్ము ఉంటే స‌రిపోదు. అంత‌కుమించి ఇంకేదైనా ఉండాలి. అలాంటి దమ్మున్న ఏకైక హీరో కాబ‌ట్టే టాప్ క్రూజ్ తో ద‌శాబ్ధాలుగా మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్‌ని ర‌న్ చేస్తోంది హాలీవుడ్‌. ది గ్రేట్ యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్ న‌టించిన మిష‌న్ ఇంపాజిబుల్ -ఫాల్ ఔట్ చిత్రం జూలై 27న రిలీజ‌వుతోంది. ఈ సినిమా నుంచి హ్యాలో జంప్ సీన్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఆకాశం నుంచి ఊపిరంద‌నంత ప్ర‌మాద‌క‌ర వాతావ‌ర‌ణంలో హై స్పీడ్‌తో హీరో గారి జంప్ విన్యాసం గ‌గుర్పొడిచేలా ఉంది. సందేహం ఉంటే మీరు కూడా చూసేయండి ఈ 2నిమిషాల 37 సెక‌న్ల వీడియో.

  •  
  •  
  •  
  •  

Comments