హీరో అఫ్ ది నేషన్ చంద్రబాబు – శత్రఘ్న సిన్హా

Monday, February 11th, 2019, 07:33:12 PM IST

చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేప్పట్టిన దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబుని పలు నాయకులూ పొగుడుతున్నారు కూడా. తాజాగా బీజేపీ రెబల్ నేత శత్రుఘ్న సిన్హా , చంద్రబాబు ని హీరో అఫ్ ది నేషన్ అని అభినందించారు. చంద్రబాబు చాల గొప్ప నాయకుడని, నియమ నిబంధనలకు కట్టు బడే గొప్ప మానస్తత్వం చంద్రబాబు ది అని పొగిడారు. ఏపీలోని ప్రజలందరికి కూడా తానూ అండగా ఉంటానని ఈ సందర్భంగా శత్రఘ్న సిన్హా చెప్పేసారు. చంద్రబాబు ఏపీ భవన్‌లో చేపట్టిన 12 గంటల దీక్షకు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసివచ్చి ఆయన మద్దతు ప్రకటించారు.

ఇచ్చిన మాట నెరవేర్చుకోవడమే మనిషికే ఉన్న గొప్ప లక్షణమని, అలాంటిది ఆ లక్షణాన్ని ఇప్పుడు అందరు కూడా కోల్పోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పట్ల ప్రధాని వ్యవహరించే తీరు సరైంది కాదని, దయచేసి మోడీగారు తన ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన అన్నారు.