పవన్ కళ్యాణ్ నన్ను కావాలనే తిట్టారు : హీరో రాజశేఖర్

Monday, October 16th, 2017, 01:56:17 PM IST

చాలా రోజుల తర్వాత హీరో రాజశేఖర్ ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం ‘గరుడవేగ’. అయితే మరికొన్ని రోజుల్లో ఆయన చిత్రం విడుదలవుతున్న సందర్బంగా ప్రమోషన్స్ లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై రాజశేఖర్ చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశారు.

ఆయనకు నేనంటే చాలా కోపమని ఇంతకుముందే చెప్పిన రాజశేఖర్ మరోసారి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం వివాదస్పదంగా మారింది. గబ్బర్ సింగ్ సినిమాలో అన్ని ఒకే.. గాని తనను లాస్ట్ లో తిట్టారు అని రాజశేఖర్ చెప్పారు. డ్యాన్స్ మూమెంట్స్ చేసిన తర్వాత అలీ ఏం చేస్తిరి.. ఏంటి అని ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు. నాకు వార్నింగ్ ఇచ్చినట్టు, నన్ను తిట్టినట్టు.. పవన్ చేశారని, నన్ను కావాలనే ఇమిటేట్ చేసి కోపాన్నిఅలా తీర్చుకున్నారు అని రాజశేఖర్ ఆరోపించారు.