పవన్ కు కౌంటర్ వేసిన హీరో శివాజీ ?

Thursday, March 29th, 2018, 10:11:58 AM IST

జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పలు విషయాలపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ పై హీరో శివాజీ కౌంటర్ వేసాడు. ప్రశ్నించండి అని పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి .. అందుకే ఆయన్ని తానూ ప్రశ్నిస్తున్నానని శివాజీ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ .. ఆంధ్రా కు పాచిపోయిన లడ్డులు ఇచ్చారని ఆ రోజు చెప్పిన పవన్ కళ్యాణ్, తానూ రోడ్డుమీదికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పాడు. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాటల్లో, విధానంలో చాలా మార్పులు వచ్చాయని ప్రధాన మంత్రి మనల్ని పట్టించుకునే స్థితిలో లేరని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ప్రధాని తనతో బాగానే ఉంటారని చెప్పారు. మూడేళ్ళలో మూడు సినిమాలు చేసుకున్న పవన్ చక్కగా సంపాదించుకున్నారు. మొన్న భహిరంగ సభలో లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసారు. అధరాలు అడిగితె బయట అనుకుంటున్నారు అంటూ చెప్పారు. మీరు ఏంతో గొప్ప హీరో అయినప్పటికీ మీరు చెప్పే ప్రతిదానికి జి హుజూర్ అనడానికి మేమేమైనా పిచ్చోళ్లమా అంటూ ప్రశిస్తున్నానని చెప్పారు. పవన్ ప్రశ్నిచామని అడిగారు కాబట్టి తాను ఇలా ప్రశ్నించానని శివాజీ చేప్పారు. మరి ఈ విషయం పై పవన్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.