తెలుగు రాష్ట్రాల్లో.. సంచ‌ల‌నం రేపుతున్న‌.. హీరో శివాజీ లేఖ..!

Thursday, November 15th, 2018, 11:06:11 AM IST

తెలుగు సినీ న‌టుడు శివాజీ కొద్ది రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నా సంగ‌తి తెలిసిందే. ఏడు నెల‌ల క్రితం ఆప‌రేష‌న్ గ‌రుడ స్క్రిప్ట్‌తో ఈ వీడియో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అంద‌రూ అప్పుడు లైట్ తీసుకున్నా.. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌ర‌గ‌డంతో అంద‌రి దృష్టి శివాజీ పై మ‌ళ్ళింది. జ‌గ‌న్ పై దాడి అనంత‌రం వైసీపీ నేత‌లు శివాజీ పై విజ‌య‌వాడ పోలీసు క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా జ‌గ‌న్ పై దాడి శివాజీకి ముందుగానే ఎలా తెలుసో చెప్పాల‌ని.. దీంతో ఆయ‌న్ని అరెస్టు చేసి విచారించాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయ‌తే ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న శివాజీ ఒక వారంలో హైద‌రాబాద్‌కు రానున్నాడ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ డీజీపీల‌కు శివాజీ రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని.. దీంతో త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని శివాజీ ఆ లేఖ ద్వారా కోరారు. దీంతో శివాజీ విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్న‌తాధికారులు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా గ‌తంలో శివాజీని చంపి ఆ నింద జ‌గ‌న్ పై వేస్తార‌ని.. ల‌క్ష్మీ పార్వ‌తి చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు చ‌ర్చ‌లోకి వ‌స్తున్నాయి. ఏది ఏమైనా శివాజీ మ్యాట‌ర్ మాత్రం ఇప్ప‌డు తెలుగు రాష్ట్రాల్లో ఆశ‌క్తిగా మ‌రింద‌ని స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు.