హీరో సుధీర్ భాబు ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ ప్రిపరేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందే వేరొక నిర్మాత నుంచి సుధీర్ బాబు అడ్వాన్సు అందుకున్నాడు. తీరా ప్రాజెక్ట్ టేకాఫ్ అవుతుంది అనుకుంటుండగానే తనతో విభేధించి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని, ఆ క్రమంలోనే 25 లక్షల అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది. ఇంతకీ ఏ ప్రాజెక్టు అంటే.. డెబ్యూ దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించే సినిమా ఇదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మెహ్రీన్ ని కథానాయిక గా సెలక్ట్ చేసుకున్నారు.
సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో విజయాలు అందుకున్న సుధీర్ బాబు గోపిచంద్ బయోపిక్ కోసం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు. మొదటి గాళ్ ఫ్రెండ్ తో బిజీ! అంటూ సుధీర్ బాబు తాజాగా ట్వీట్ చేశాడు. తన కెరీర్ మొదలైందే బ్యాడ్మింటన్ తో తిరిగి అదే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు. ఒక ప్రాజెక్టుకు కటీఫ్ చెప్పేసి, ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా బరిలో దిగిపోయాడన్నమాట. తొందర్లోనే కాస్టింగ్ వివరాల్ని ప్రకటిస్తారట.
Sivaji K