తప్పేమి లేదు.. అసెంబ్లీ రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు!

Wednesday, September 12th, 2018, 03:59:33 PM IST

కొత్త రాష్ట్రం తెలంగాణాలో ముందస్తు ఎన్నికలో ఇంత త్వరగా వస్తాయని ఎవరు ఊహించలేకపోయారు. కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ వెనుక అసలు రహస్యం ఇదేనని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచనతోనే టీఆరెస్ పార్టీ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమైనట్లు ఎవరికీ తోచినట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు ఆ సంగతి అటుంచితే ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం పిటిషన్ ను కొట్టివేసింది. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాజ్యాంగానికి ఆటంకం కలిగించే అంశాలు ఏవి పిటిషన్ లో పొందు పర్చలేదని కోర్టు పేర్కొంటూ.. అసెంబ్లీ రద్దు నిర్ణయం అభివృద్ధికి ఆటంకం కాదని న్యాయస్థానం వివరణ ఇచ్చింది. కేవలం రాజకీయ పలుకుబడికోసమే ఈ విధంగా పిటిషన్ వేశారని హైకోర్టు తెలిపింది. అసెంబ్లీ రద్దులో రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు కనిపించలేదని అందుకే పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పును వెలువరించింది.

  •  
  •  
  •  
  •  

Comments