తెలంగాణలో ఎన్నికల ఫీవర్ ఇప్పుడప్పుడే తగ్గదు!

Friday, October 12th, 2018, 12:09:29 PM IST

ముందస్తు ఎన్నికల కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల హడావుడి మొదలుకాగా ఇది కొని నెలల పాటు సాగనుంది. ముందస్తు ఎన్నికలు డిసెంబర్ 11 తో ముగియనుండగా ఆ వెంటనే మరొక ఎన్నికలు మొదలుకానున్నాయి. అవే పంచాయతీ ఎలక్షన్స్.

పంచాయతీ పాలక వర్గాల గడువు గత జూలై నెలలోనే ముగియగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి పాలన్ కొనసాగిస్తూ వచ్చింది టిఆర్ఎస్. దీన్నీ సవాల్ చేస్తూ సర్పంచుల సంఘం వేసిన పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టు నిన్న సంచలన తీర్పునిచ్చింది.

నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఇలా ప్రత్యేక అధికారుల్ని నియమించి పాలన చేయడం స్థానిక స్వపరిపాలన వ్యవస్థకు విఘాతమని ఉద్ఘాటించిన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇంకో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలను బట్టి ఈ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలోనే ఉంటాయని అనుకోవచ్చు. అవి ముగిసిన వెంటనే లోక్ సభ ఎన్నికలు మొదలుకానున్నాయి. దీంతో ఇంకో 5, 6 నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ అలానే కొనసాగనుంది.