రేవంత్ రెడ్డికి ఉన్న ప్రాణహాని పై హైకోర్టు సంచలన తీర్పు..!

Monday, October 29th, 2018, 03:21:50 PM IST

తెలంగాణా రాష్ట్రం కొడంగల్ నియోజకవర్గం టీకాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పై ఆ మధ్య అకస్మాత్తు ఐటీ దాడులు సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసినదే,అయితే అప్పుడు కెసిఆర్ మరియు బీజేపీ పార్టీలు కలిసిపోయి రేవంత్ రెడ్డి పై కావాలనే కుట్ర పూరితంగా ఈ దాడులు నిర్వహించారని అక్కడి టీకాంగ్రెస్ నేతలు మరియి రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు పెద్ద స్థాయిలోనే తమ నిరసనను వ్యక్తపరిచారు.అదే సందర్భంలో తన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని కూడా ఉందని అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దానితో మరింత దుమారం చెలరేగింది,తనకి ప్రాణ హాని ఉందని తనకు తగిన భద్రత కల్పించాలని హైకోర్టులో పిటీషను కూడా దాఖలు చేశారు.అయితే ఆ పిటీషను మీద హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి కు ప్రాణ హాని ఉంది అన్న పిటీషనను వారు స్వీకరిస్తున్నామని,రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.కాకపోతే రేవంత్ కు భద్రతగా వచ్చే రక్షణ సిబ్బందికి అయ్యే ఖర్చులు మాత్రం రేవంతే పెట్టుకోవాలని సూచించింది.వచ్చే డిసెంబరులో జరిగేటటువంటి ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.