బిగ్ బ్రేకింగ్.. బోండా ఉమ‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు..!

Wednesday, October 17th, 2018, 02:45:03 PM IST

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. అయితే ఇటీవ‌ల ఫోర్జ‌రీ కేసులో ఇరుక్కున్న బోండా ఉమ దంపతులకు హైకోర్టు షాక్ ఇచ్చిది. పోర్జ‌రీ కేసు విష‌యంలో బోండా ఉమ దంప‌తులతో స‌హా 9 మందికి హైకోర్టు ఝ‌లక్ ఇచ్చింది. వారి పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌వాడ పోలీసుల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో బోండా ఉమ త‌న పై న‌కిలీ ప‌త్రాలతో, బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని రామిరెడ్డి కోటేశ్వ‌ర‌రావు అనే వ్య‌క్తి విజ‌య‌వాడ సీపీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే విజ‌య‌వాడ పోలీసులు కేసున‌మోదు చేయ‌క‌పోవ‌డంతో రామిరెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించి బోండా ఉమ పై పిటీష‌న్ వేశారు. దీంతో తాజాగా ఈ పిటీష‌న్‌ను విచారించిన కోర్టు.. బోండా ఉమ దంప‌తుల‌తో స‌హా మొత్తం తొమ్మిదిమంది పై కేసు నమోదు చేసి వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు విజ‌య‌వాడ పోలీసుల‌ను ఆదేశింది. మ‌రి విజ‌యవాడ పోలీసులు బోండా ఉమ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.