వీడియో : మూకుమ్మడి దాడిని సెంటిమెంట్ తో తిరగేసిన జనసేనాని !

Thursday, January 25th, 2018, 03:52:56 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ సక్సెస్ అయింది. ఖమ్మంలో జన సైనికులతో ముఖాముఖి ముగించుకున్న పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నాడు. జనసేన పార్టీ స్థాపించిన తరువాత పవన్ కళ్యాణ్ తొలి తెలంగాణ పర్యటన ఇదే. పవన్ కళ్యాణ్ కేసీఆర్ కలసిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ లో ప్రముఖ నేతలంతా పవన్ కళ్యాణ్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. జనసేనాని ఏమాత్రం ఆ విమర్శలు పట్టించుకోకుండా తెలంగాణలో తన పర్యటన కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి సున్నితంగానే రిప్లై ఇచ్చాడు. కాంగ్రెస్ నేతల విమర్శల కంటే పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బాగా సక్సెస్ అయింది.

తెలంగాణ పర్యటన తొలి అడుగునుంచే పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు. తన సతీమణి అన్నా లెజినోవా తో టూర్ ని ప్రారంభింపజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కొండగుట్ట లో ఆంజనేయ స్వామికి పూజలు చేయడం, ఆలయానికి రూ 11 లక్షలు విరాళాలు ఇవ్వడం మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో తాను రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నానాయి సంకేతాలు ఇచ్చారు. ఏపీలో పొలిటికల్ టూర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలే తన ఎజెండా అని తెలిపారు. ఏపీలో కూడా సమస్యలు పరిష్కరించటానికి తాను పర్యటిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక కరీంనగర్ లో అత్యుత్సాహం చూపిన ఓ అభిమాని గాయపడడంతో ఇలా ఇంకెవరూ అత్యుత్సాహం ప్రదరించవద్దని మీకేమైనా అయితే తాను తట్టుకోలేనని పవన్ తన అభిమానుల మనసులు దోచుకున్నాడు. ఇక ఖమ్మం లో పవన్ కళ్యాణ్ తన అభిమానులని కలుసుకున్నాడు. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న సమయంలో శ్రీజని ఆసుపత్రిలో పవన్ పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఎదో మాయ జరిగినట్లు శ్రీజ ఆ తరువాత కోలుకుంది. తన సొంత జిల్లాకు పవన్ కళ్యాణ్ వస్తుండడంతో శ్రీజ కుటుంబ సభ్యులు జనసేనానిని కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చాకే తన ఆరోగ్యం కుదుట పడిందని శ్రీజ మరో మారు పునరుద్ఘాటించింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన మరో అభిమాని కుటుంబాన్ని కలుసుకున్నారు. అత్తారింటికి దారేది చిత్ర సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ సతీష్ అనే యువకుడు తన కాలుని పోగొట్టుకున్నాడు. అతడి నడుము కూడా విరిగిపోయింది. సతీష్ ప్రస్తుతం స్ట్రెచర్ కు మాత్రమే పరిమితమయ్యాడు. అతడి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించాడు.

పవన్ కళ్యాణ్ తెలంగాణ సెంటిమెట్, అభిమానుల సెంటిమెట్ ముందు కాంగ్రెస్ నేతల విమర్శలు నిలబడలేదు. జైతెలంగాణ అంటూ నినదించిన జనసేనాని తాను ఇక్కడివాడినే అని సంకేతాలు పంపారు. తనపై తీవ్రవిమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలపై పవన్ కళ్యాణ్ ఓవర్ గా రియాక్ట్ కాలేదు. తనపై విమర్శలు చేసిన విహెచ్ గురించి తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన కలసి వస్తే ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడానికి తాను సిద్ధం అని పవన్ అన్నారు. ఇలా సెంటిమెంట్ మజిలీలతో పవన్ తెలంగాణ టూర్ విజయవంతంగా పూర్తయింది. ఇక ఓవర్ టూ అనంతపూర్..!