అనుమతి లేకున్నా ఆపనంటున్న ముద్రగడ..కిర్లంపూడి లో హై టెన్షన్..!

Tuesday, November 15th, 2016, 04:08:12 PM IST

mudragada-padmanadam
ఓ కాపు గర్జన సభ, రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు..అంతే ఉన్నట్లుండి వార్తల్లోని వ్యక్తి అయిపోయారు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ ల కోసల ఆయన చేసిన ఉద్యమం ఏపీలో ఎంతటి కలకలం రేపిందో తెలిసిన విషయమే.కాగా మరోమారు అయన తన పోరాటాన్ని కొనసాగించనున్నారు.ఈ సారి ఆయన పోరాటానికి పాదయత్రని మార్గంగా ఎంచుకోవడం విశేషం. తాను రేపటినుంచి పాదయత్రని ప్రారంభించనున్నట్లు ముద్రగడ ఇదివరకటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయతే ఆయన పాదయాత్రకు ఆటంకాలు తప్పేలా లేవు.

ముద్రగడ పాదయత్రని నిలిపివేయాలని హై కోర్ట్ లో ఫిటిషన్ దాఖలైంది. దీనితో హై కోర్ట్ ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. పాదయాత్రలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం హామీ ఇవ్వగలదా అని ప్రశ్నించింది. దీనితో ప్రభుత్వం తరపున న్యాయవాది పాదయాత్రకు అనుమతి కోరుతూ ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. విచారణ అనంతరం హై కోర్ట్ తదుపరి విచారణను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరో వైపు అనుమతి లభించినా లభించకపోయినా పాదయత్రని కొనసాగిస్తానని ముద్రగడ ఖరాఖండిగా చెబుతున్నారు.ఇప్పటికే ముద్రగడ ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించగా, స్పెషల్ ఫోర్స్ , ఆర్మీ ఫోర్స్ సైతం రంగంలోకి దింపుతున్నారు. దీనితో కిర్లంపూడి లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.