హిందూపురం గ్రౌండ్ రిపోర్ట్..ముగ్గురిలో గెలుపు ఎవరిది.?

Thursday, May 16th, 2019, 09:59:06 AM IST

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పిలవబడే జిల్లాలలో అనంతపురం జిల్లా కూడా ఒకటి.అవ్వడానికి అది రాయలసీమ ప్రాంతమే అయినా సరే అక్కడ ఉన్న 14 స్థానాల్లో గత ఎన్నికలలో ఏకంగా 12 స్థానాలు కైవసం చేసుకుందంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో అర్ధం చేసుకోవచ్చు అలాగే అక్కడ ఆ పార్టీకి తిరుగులేని నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది హిందూపురం నియోజకవర్గం అనే చెప్పాలి.అక్కడ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దాఖలాలు లేవు.ఇప్పుడు ఇదే నియోజకవర్గం మళ్ళీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఎందుకంటే అక్కడ ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బాలయ్యే పోటీలో ఉన్నారు.అక్కడ బాలయ్యకు అపారమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసినదే.అందువలనే అక్కడ బాలయ్య గెలుపు మరింత సులువయ్యింది.కానీ ఈసారి మాత్రం అలా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.ఈసారి అక్కడ జనసేన మరియు వైసీపీ పార్టీల వల్ల త్రిముఖ పోరు తప్పనిసరిగా కనపడుతుంది అని చెప్తున్నారు.ఇదే అక్కడి స్థానికుల మాట కూడా.గడిచిన ఐదేళ్లలో అక్కడ బాలకృష్ణ చేసిన అభివృద్ధి పనులు ఏమి పెద్దగా కనిపించకపోగా బాలయ్య వ్యవహార శైలి వలన ఒకింత వ్యతిరేఖత పెరిగిందనే మాటే వినపడుతుంది.

అలాగే అక్కడ నుంచి వైసీపీ పార్టీ తరపున రిటైర్డ్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహమ్మద్ నిలబడడంతో మైనార్టీ ఓట్లు మరియు జగన్ వేవ్ పనిచేస్తుందని,ఇక అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ఆకుల ఉమేష్ పోటీలో ఉన్నారు.దీనితో అక్కడ స్థానికుడు అయితే ఎప్పుడూ దగ్గరగా ఉంటాడన్న మరో నినాదంతో జనసేన కూడా తక్కువ కాదు అని అనిపిస్తుంది.దీని వల్ల అక్కడ ఈసారి మాత్రం బాలయ్య గెలుపు ఖచ్చితంగా అంత ఈజీ రాయితీ కాదని తెలుస్తుంది.జనసేన ప్రభావం కానీ గట్టిగా ఉండి ఓట్లు చీల్చినట్టయితే అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఎందుకంటే అక్కడ టీడీపీ మరియు వైసీపీల మధ్య కేవలం ఇరవై వేల ఓట్ల తేడాయే కనపడుతుందని అది జనసేన చీల్చితే అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.ఒకవేళ వైసీపీ ఓట్లకు మరియు తెలుగుదేశం రెండు పార్టీల ఓటు బ్యాంకుకు కానీ గండి కొట్టినట్టైతే ఫలితాలు ఊహించలేమని విశ్లేషకులు తెలుపుతున్నారు.మరి అక్కడ ఫలితాలు ఎలా రాబోతున్నాయో తెలియాలంటే రాబోయే 23 వరకు ఆగక తప్పదు.