హిట్టా లేక ఫట్టా : అరవింద సమేత – ఎమోషనల్ ఫ్యాక్షన్ డ్రామా

Friday, October 12th, 2018, 02:01:52 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల నడుమ ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.ఇది వరకు ఎప్పుడు టచ్ చెయ్యని కథతో దానికి తోడు తారక్ మరియు త్రివిక్రమ్ కంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పుడు ఈ అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా?ఇప్పుడు చూద్దాం.

ఇక కథ లోకి వెళ్లినట్టయితే రాయలసీమలోని ఇద్దరు వర్గీయుల కుటుంబాలు పగ ,ప్రతీకారాలతో రగిలిపోతుంటాయి.వారే జగపతి బాబు(బసి రెడ్డి) మరియు నాగేంద్ర బాబు(నారాప రెడ్డి).ఈ ఇరు కుటుంబాలకు మధ్య గొడవలు,కొట్లాటలు తారా స్థాయిలో ఉంటాయి.అదే నేపథ్యంలో వచ్చినటువంటి కలహాల్లో నారాప రెడ్డి చనిపోతాడు. దీనితో అతని కొడుకు ఎన్టీఆర్ (వీర రాఘవ రెడ్డి) కూడా కత్తి పట్టుకుంటాడు.ఆ తరువాత అతను ఉన్న ప్రదేశంలో వచ్చిన మార్పులు ఏమిటి?ఈ చిత్ర కథానాయిక పూజ హెగ్డే తారక్ కు ఏ విధంగా సహాయపడింది,కలహాల వల్ల అక్కడ నష్టపోయిన కుటుంబాలను చూసి తారక్ లో ఎలాంటి మార్పు వచ్చింది.తనలాగే మిగతా వారి అందరిని అతను మార్చగలిగాడా?ఆ సందర్భంలో అతను ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి అన్నది వెండితెర మీదనే చూడాలి.

ఇప్పటికే తారక్ ఈ చిత్రానికి తన ప్రాణం పెట్టి పని చేసాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు,అంతే కాకుండా తన తండ్రి చనిపోయినా సరే ఆ బాధని అంతటిని దిగమింగుకొని మరీ ఈ పూర్తి చేసాడు.ఈ చిత్రం మొదట్లోనే పోరాట సన్నివేశాలతో మొదలవ్వడంతోనే తీరా స్థాయికి చేరుకుంటుంది,దానికి తోడు తారక్ అద్భుతమైన నటన ఇది వరకు చేసిన సినిమాలను మించి ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి.(అరవింద)గా పూజ కూడా అద్భుతమైన నటనను కనబర్చింది.అదే విధంగా జగపతి బాబు,ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సునీల్ చెప్పినట్టుగా ఆయన క్రూరమైన ప్రతినాయకుని పాత్రకి ప్రాణం పోసేసారు.ముఖ్యంగా త్రివిక్రమ్ యొక్క దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సిందే “అజ్ఞ్యాతవాసి” వంటి భారీ ప్లాప్ నమోదు చేసుకున్నా సరే ఆ ప్రభావం చిత్రం మీద ఏ మాత్రం కూడా పడలేదు.రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ ఎంచుకున్న కథ ఇప్పటివరకు ఏ దర్శకుడు తీసుకోలేదనే చెప్పాలి.అది ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.

దానికి తోడు త్రివిక్రమ్ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు,ఎక్కడా మితి మీరిన భావోద్వేగాలను కూడా పెట్టకుండా చాలా జాగ్రత్త వహించి తీశారు.ఇవన్నీ ఈ చిత్రానికి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి థమన్ ప్రాణం పెట్టాడని తారక్ అన్నారు.ఈ మాటలకు అన్ని విధాలా థమన్ న్యాయం చేకూర్చారు.బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐతేనేం చిత్రం అంతటికి తన సంగీతంతో ప్రాణం పోశాడు.ఒక తల్లి బాధని కొడుకు చెప్పే విధంగా కూర్చిన “పెనివిటీ” పాట చిత్రం అంతటికి ప్రధానాకర్షణ గా నిలిచిపోతుంది.

ఇక ఈ చిత్రానికి సంబందించిన మైనస్ పాయింట్స్ మరీ ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు. ముందు అంతా చిత్రాన్ని ఒక భావోద్వేగం మీద తీసుకెళ్లిన త్రివిక్రమ్ సెకండాఫ్ కి వచ్చేసరికి కాస్త నెమ్మదించాడనే చెప్పాలి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు ఆశించే వాళ్లకి ఈ చిత్రం కాస్త చేదు అనుభవాన్నే మిగులుస్తుంది అని చెప్పాలి. ఈ చిత్రంలో సునీల్ ని తీసుకునే సరికి మళ్ళీ త్రివిక్రమ్ సునీల్ కాంబోలో కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకున్న వాళ్ళకి కూడా చేదు అనుభవాన్నే మిగులుస్తుంది అని చెప్పాలి. అలా అని కావాలని అనవసరమైన హాస్య సన్నివేశాలు పెట్టినా మన తెలుగు ప్రేక్షకులు తిప్పి కొడతారు.మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం మంచి కథా బలంతో,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో తారక్ అద్భుతమైన నటనతో ఈ దసరాని ఇంకాస్త ఉత్సాహంగా జరుపుకోడానికి కొత్త బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి.దసరా బరిలోఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవొచ్చు.

ఎమోషనల్ గా సాగే యాక్షన్ డ్రామా.

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల నుంచి మంచి చిత్రం.

Reviewed By timesofindia.com |Rating : 3.5/5

ఎన్టీఆర్ వన్ మాన్ షో

Reviewed By gulte.com |Rating : 3/5

త్రివిక్రమ్ యొక్క మార్క్ ఫ్యాక్షన్

Reviewed By greatandhra.com|Rating : 3/5

త్రివిక్రమ్ మార్క్ లో ఫ్యాక్షనిజంని చూస్తారు.

Reviewed By idlebrain.com|Rating : 3.25/5

పాత కథలో ఎన్టీఆర్ సవారీ

Reviewed By Tupaki.com|Rating : 3/5

యుద్ధం కంటే శాంతి గొప్ప‌దంటున్న త్రివిక్రమ్

Reviewed By indiaglitz.com|Rating : 3/5

శాంతియుత యుద్ధం.

Reviewed By cinejosh.com|Rating : 3/5