ధోని సిక్సర్ల రికార్డుకు దగ్గరగా “హిట్ మ్యాన్”..!

Monday, January 28th, 2019, 04:19:26 PM IST

ప్రస్తుతం భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ దేశంలోని మౌంట్ మౌంగాని వేదికగా ఈ రోజు ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరిగింది.ఇప్పటికే ఈ సిరీస్ లో 2 వరుస విజయాలను అందుకున్న కోహ్లీ సేన ఈ రోజు కూడా విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.ఈ రోజు జరిగినటువంటి మ్యాచులో కివీస్ ఇచ్చిన 243 పరుగుల లక్ష్యాన్ని మన జట్టు కేవలం 43 ఓవర్లలోనే ఛేదించింది.అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 77 బంతుల్లో 62 పరుగులు,రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 74 బంతుల్లో 60 పరుగులు మరియు అంబటి రాయుడు 40 బంతుల్లో 40 పరుగులు,దినేష్ కార్తీక్ 38 బంతుల్లో 38 పరుగులు చేసి విజయాన్ని పొంది 3-0 తో సిరీస్ కైవసం చేసుకున్నారు.

అయితే ఈ రోజు జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 2 సిక్సర్లను కూడా బాదారు.దీనితో ఇప్పటి వరకు వన్డే విభాగంలో 215 సిక్సర్లు బాదిన రెండో భారతీయ బ్యాట్సమెన్ గా రోహిత్ నిలుచున్నారు.అయితే రోహిత్ కన్నా ముందు వరుసలో క్యాప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 222 సిక్సర్లతో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.ఇప్పుడున్నా పరిస్థితుల్లో రోహిత్ ధోని రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టతరమేమి కాదు.ఇంకో రెండు మ్యాచులున్నాయి కదా ఈలోపు ధోని రికార్డును బద్దలు కొడతారేమో వేచి చూడాలి.