“హిట్ మ్యాన్” మిస్సయ్యాడు..”గబ్బర్” కుమ్మేసాడు..!

Sunday, March 10th, 2019, 04:09:35 PM IST

ప్రస్తుతం భారత్ మరియు ఆసీస్ జట్ల మధ్య ఒన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసినదే ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఒకటి ఆసీస్ గెలవగా రెండు భారత్ గెలిచింది.అయితే ఈ రోజు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా 4 మ్యాచ్ మొదలయ్యింది.మొన్నటి మ్యాచుల వరకు తడబడిన ఓపెనర్ బ్యాట్సమెన్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరియు గబ్బర్ శిఖర్ ధావన్ ను జూలు విదిల్చారు.

క్రీజులో అడుగు పెట్టిన దగ్గర నుంచి మంచి పార్టనర్ షిప్ తో జట్టును స్కోర్ కార్డును పరిగెత్తించారు.అయితే రోహిత్ 2 సిక్సర్లు, 7 ఫోరులతో విజృంభించి 95 పరుగులు చేసి కేవలం 5 పరుగుల తేడా తో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు.రోహిత్ గురి తప్పినా కానీ గబ్బర్ గురి మాత్రం తప్పలేదు.12 ఫోర్లు ఒక సిక్సర్ బాది కేవలం 97 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసి కంగారులను ఖంగారు పెట్టించాడు.వీరిద్దరి భాగస్వామ్యం వలన ఇప్పుడు భారత జట్టు భారీ లక్ష్యం దిశగా పరుగులు పెడుతుంది.