ఆరు సంవత్సరాలు ఆరు 150 లు “హిట్ మ్యాన్” భీబత్సం..!

Monday, October 22nd, 2018, 06:35:58 PM IST

టీం ఇండియా “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ క్రీజులో ఒక్క పది ఓవర్లు సరిగ్గా నిలబడి తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడంటే చాలు ఇక స్టేడియం లోని బంతి ఫోర్లు,సిక్సర్లతోనూ బౌండరీని దాటాల్సిందే..ఒక్క సారి సరిగ్గా నిలదొక్కుకున్నాడంటే చాలు ఇక రోహిత్ పాతిన జెండాలో క్రీజ్ లో నిలిచిపోతాడు.అలా అని మెల్లగా ఆడుతాడా అంటే అది కాదు వీరోచిత పోరాటంతో ప్రపంచంలో ఏ ఆటగాడు కొట్టలేనంత,ఒక పూర్తి జట్టు మొత్తం కొట్టేంత స్కోరును అతనొక్కడే కొట్టి ప్రపంచ రికార్డులను కొల్లగొట్టేస్తాడు.

ఇప్పుడు కూడా రోహిత్ మళ్ళీ అలాంటి ఒక అరుదైన రికార్డునే మళ్ళీ సాధించాడు.నిన్న గవహాటి లో వెస్టిండీస్ తో జరిగినటువంటి వన్డే మ్యాచులో మళ్ళీ రోహిత్ విరుచుకుపడి 152 పరుగులను సాధించాడు.ఇప్పుడు ఈ 152 పరుగులే రోహిత్ కు ఒక అరుదైన రికార్డును అందించాయి.2013 నుంచి నిన్నటి వరకు వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు సార్లు 150 పరుగులు చేసినటువంటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.అయితే రోహిత్ కన్నా ముందు ఇలాంటి రికార్డులానే వరుసగా ఐదు ఏళ్లలో ఐదు సార్లు వరుస 150 పరుగులతో ఉన్నటువంటి సచిన్ యొక్క రికార్డును నిన్న రోహిత్ అధిగమించాడు.

  •  
  •  
  •  
  •  

Comments