హిట్టా లేక ఫట్టా : తొలిప్రేమ ట్రెండీ టాక్

Saturday, February 10th, 2018, 05:12:15 PM IST


మెగా హీరోల్లో అందరు హిట్లు కొట్టేశారు వరుణ్ తేజ్ తప్ప అని అనుకుంటున్నా సమయంలో ఫిదా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. మంచి లవ్ స్టోరీ తరువాత మరో కొత్త తరహా లవ్ స్టోరీతో వస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోను పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ తెచ్చిన తొలిప్రేమ టైటిల్ ను ఎంచుకోవడం తో పవన్ అభిమానులు కూడా సినిమాను చూడాలని ఆశతో ఉన్నారు. అయితే ఎట్టకేలకు సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మనకంటే ఒకరోజు ముందే ప్రవాసులు చూసి మంచి మార్కులే వేయడంతో ఇంకొంచెం అంచనాలు పెరిగాయి.

అయితే సినిమాకి ప్రస్తుతం టాక్ బాగానే వస్తోంది. ప్రేమ కథలు మనం చాలా చూసినప్పటికీ ఇందులో ఉన్న ప్రేమ చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా వరుణ్ – రాశి ఖన్నా కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అయ్యిందని చెప్పాలి. దర్శకుడు ఎక్కడా తడబడకుండా సినిమాను ఒక లెవెల్లో తీసుకెళ్లాడు.తొలిప్రేమ టైటిల్ కు తగ్గట్టుగానే కథ నడుస్తుంది. అయితే మధ్యలో కొంచెం స్లో సీన్స్ అంతగా మెప్పించావు. కానీ ఆ తరువాత వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమా మూడ్ ని మార్చేస్తాయి. ఇక థమన్ మ్యూజిక్ సినిమాకు మరోబలం. మొత్తంగా సినిమా ప్రేమికులకు చాలానే నచ్చుతుంది అని చెప్పవచ్చు. కానీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెద్దగా ఉండవు. మరి ఆ వర్గం వారికీ నచ్చుతుందో లేదో చూడాలి.

 

తొలిప్రేమ – మనసుని తాకే ప్రేమ కథ

Reviewed By 123telugu.com |Rating : 3.5/5

ఇష్టపడే సినిమా

Reviewed By mirchi9.com |Rating : 2.75/5

తొలి ప్రేమ.. ఫీల్ ఉన్న లవ్ స్టోరీ

Reviewed By tupaki.com |Rating : 3/5

ఆ బ్యూటిఫుల్ జర్నీ అఫ్ లవ్

Reviewed By gulte.com |Rating : 3/5

తొలిప్రేమ మరొక మంచి ప్రేమ కథ

Reviewed By chitramala.in |Rating : 3/5